జైపూర్ మండలంలో డిపిఓ ఆకస్మిక పర్యటన.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర రావు జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించి పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈక్రింది సూచనలు చేయడం జరిగింది.
పి ఎ ఐ (పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) డాటా ఎంట్రీని పరిశీలించి అన్ని శాఖల నుండి సమాచారం సేకరించి ఆన్లైన్ నందు నమోదు చేయించాలి. ఆ యొక్క వివరాలను రేపు గ్రామసభ నిర్వహించి ఫొటోస్ & ఒక నిమిషం వీడియోను తీసి వాట్సాప్ గ్రూప్ నందు పోస్ట్ చేయాలని సూచించారు. ఎస్ ఎస్ జి ఫీడ్బ్యాక్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ లిస్టు మెర్జింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి వెబ్సైట్ నందు నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజు అటెండెన్స్ మరియు డి ఎస్ ఆర్ నిర్ణీత సమయంలోపట పూర్తి చేయాలని సూచించారు. లేనియెడల తాగు శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఎం ఏ ఎస్ (మంత్లీ ఆక్టివిటీ స్టేట్మెంట్) వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ , ఎంపీఓ శ్రీపతి బాపు రావు, మరియు ఆయా గ్రామాల పంచాయితి కార్యదర్శులు పాల్గొన్నారు