వన్యప్రాణులను హాని తలపెట్టద్దు
-ఎఫ్ ఆర్ ఓ వేణుగోపాల్ .
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ : అక్టోబర్ 25
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్:
వన్యప్రాణులకు ఎలాంటి హానీ తలపెట్టద్దని
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ అన్నారు. రెండు రోజులుగా
బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తూ ఉన్నందున సరిహద్దు అటవీ ప్రాంతం అయిన సారంగాపూర్ సెక్షన్ పరిధిలోని ఇప్పచెల్మ, పెండల్దరి అటవీ గ్రామాల్లో గురువారం రాత్రి వేళ అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.
ప్రజలను అప్రమత్తం చేసి, తీసుకోవాల్సిన జాగ్ర్రత్తలను సూచించారు . వన్యప్రాణుల సంరక్షణలో అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో నిర్మల్ టాస్క్ ఫోర్స్, డివైఆరో లు నజీర్ ఖాన్,సంతోష్ , ఫాజిల్ హుస్సేన్ ఎఫ్బిఓ లు పాల్గొన్నారు.