- నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం లక్ష రూపాయల విరాళం అందజేత.
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, కుటుంబ సభ్యుల ఘన సన్మానం.
- దేవాలయ నిర్మాణంలో సహకారాన్ని అదృష్టంగా భావించిన దేపల్లి అశోక్ గౌడ్.
రంగారెడ్డి జిల్లా నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి శ్రీ గిరీషన్ సతీషన్ నాయర్ చేతులమీదుగా దేపల్లి కుటుంబాన్ని ఘనంగా సన్మానించారు. దేవాలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ దంపతులు ఒక లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ విరాళాన్ని గురుస్వామి శ్రీ గిరీషన్ సతీషన్ నాయర్ గారికి ఆదివారం అందజేశారు.
దేవాలయ నిర్మాణంలో తన వంతు సహకారం అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు దేపల్లి అశోక్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి చేతులమీదుగా దేపల్లి కుటుంబాన్ని శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లెళ్ల బాల్ రెడ్డి, బాతుక లక్ష్మయ్య యాదవ్, బంటారం దర్శన్ గౌడ్, నరసింహులు గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.