రక్తదానం చేయండి… ఒక జీవితాన్ని కాపాడండి
మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ముందడుగు
మనోరంజని తెలుగు టైమ్స్ – ప్రొద్దుటూరు, నవంబర్ 17
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పావతి అనే మహిళకు రక్తహీనత కారణంగా B+ పాసిటివ్ రక్తం అత్యవసరం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు వెంటనే స్పందించారు. తక్షణమే ఫౌండేషన్ సభ్యుడు మైకేల్ బాబు రక్తదానానికి ముందుకు రావడంతో, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో B+ పాజిటివ్ రక్తదానం చేపట్టారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణాన్ని కాపాడడంలో సహకరించిన మైకేల్ బాబుకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, కృపా అగ్ని షారోన్ ట్రస్ట్ సుమన్ బాబు, ప్రసన్న కుమార్, పాపిశెట్టి వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. రక్తదాతల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
📞 8297253484
📞 9182244150