మద్యం సేవించి వాహనాలు నడపవద్దు ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 11

వానదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్సై బిట్ల పెర్సిస్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద ఎస్సై పెర్సిస్ ఆధ్వర్యంలో శనివారం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, హెల్మెట్ ధరించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ యశ్వంత్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment