డి జే ఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా కేంద్రం లో డి జేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి మాట్లాడుతూ ..డి జేఎఫ్ ఆధ్వర్యంలో.. ఆగస్టు 10వ తేదీన ఆదివారం పెద్దపెల్లి జిల్లాలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ఐదో మహాసభకు జిల్లా నుండి వందలాదిగా జర్నలిస్టు మిత్రులు కదిలి రావాలని పిలుపునిస్తూ.. ఇదే కార్యక్రమంలో ప్రతి డిజేఎఫ్ సభ్యులకి హెల్త్ కార్డులు ,ఇన్సూరెన్స్ పత్రాలు అందజేయడం జరుగుతుంది .కావున మంచిర్యాల జిల్లా అదేవిధంగా జిల్లాలోని వివిధ మండలాలలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న డి జె ఎఫ్ కుటుంబ సభ్యులందరూ.. ఈ ఉచిత లబ్ధి పొందాలని ,సభ్యులందరికీ పేరుపేరునా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. జాతీయ కార్యదర్శి కోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ,రాష్ట్ర సహాయ కార్యదర్శి వేల్పులు నగేష్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ పెళ్లి సతీష్ , జిల్లా నాయకులు శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు