కౌట్ల–బి గ్రామంలో దివ్యాంగుడు కాంగ్రెస్ తరఫున బరిలో
మనోరంజని తెలుగు టైమ్స్ — సారంగాపూర్, డిసెంబర్ 3
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల–బి గ్రామపంచాయతీ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివ్యాంగుడైన బేడద శంకర్ బరిలో దిగారు. రెండు చేతులు లేకున్నా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. శంకర్ నామినేషన్ వేసిన వెంటనే గ్రామ ప్రజలు ఆయనను అభినందించి ప్రోత్సహించారు. దివ్యాంగులకు రాజకీయాల్లో కూడా అవకాశాలు లభించాలని, శంకర్ ముందుకు రావడం యువతకు ప్రేరణగా నిలుస్తుందని స్థానికు