. దివ్య దీపావళి
జాతి ప్రగతికి కావాలి
నూతన క్రాంతి
వెలుగులు విరజిమ్మే
దీపావళి
కొత్త ఆశలతో
కొత్త ఆకాంక్షలతో
కొత్త ఆలోచనలతో
కొత్త తీర్మానాలతో
కొత్త లక్ష్యాలతో
దివ్వెల వెలుగుల
సందడి సంతోషాల
సంబరాల్లో ఇల్లంతా
నూతన శోభ వర్థిల్లేలా
దీపావళి వేడుకలు
జరుపుదాం
మనసున ఉన్న భాధలు
మరిచిపోధాం
పగలు ప్రతీకారాలను
కక్షలు కార్పణ్యాలు
మోసం ద్వేషం
కుట్ర కుయుక్తులు
మానుకుందాం
మానవత్వాన్ని
పరిమళించే జ్యోతులమై
వికసిత భారత్ లక్ష్య
సాధనకు స్వదేశీ
స్వాలంభన సాధనకు
సారధులమై
సుస్థిర వృద్ధికి
పాటుపడుదాం
సుఖ సంతోషాలతో
శాంతి సౌభాగ్యాలతో
ఆత్మీయత అనురాగంతో
ఆప్యాయత అభిమానంతో
ఆదరణ ఆనందంతో
ఆర్థత సౌహార్ధతతో
భందాలు అనుబంధాలతో
ప్రేమ క్షమ ధయార్ధతతో
సహకారం సమన్వయంతో
సానుకూలత సోధరత్వంతో
సహనం సంఘీబావంతో
స్నేహ సౌభ్రాతృత్వంతో
సమత మమత సమైక్యతతో
సామరస్యత మానవీయత
పరిమళాల భరిత భవితకు
భద్రతకు దీపావళి బాట కావాలి
నమ్మకాలు విశ్వాసాలతో
ఆప్యాయత అనుకూలత
లతో ఆర్ద్రత అవగాహనతో
కుటుంబ వ్యవస్థ
పునరుజ్జీవనానికి
అంకితమౌదాం
పట్టుదల త్యాగాలతో
ప్రగతి పురోగతి కై
పాటుపాడుదాం
కుట్ర కుళ్ళు కుతంత్రాల
కుయుక్తుల ఆటకట్టించాలి
పగలు పంతాలు కల్మషం
కాలుష్యం కాఠిన్యం కలహాల
కట్టడితో
సంక్షోభ రాజకీయులు వద్దు
సంక్షేమ రాజకీయాలే హద్దు
అగ్రవాదం ఉగ్రవాదం
ఉన్మాధం కుటుంబ పాలన
నేర రాజకీయాలు అంతరించి
అవినీతి రహిత భారత్
శాంతి యుత స్వచ్ఛ భారత్
స్వయం సమృద్ధ
స్వాభిమాన భారత్
నైపుణ్యాలే ఆలంభణగా
ఆత్మనిర్భరభారత్
అభివృద్ధి భారత్ గా
అవతరించాలి
వైరస్సులను
ఎదుర్కోనే మనోథైర్యం
మానవాళికి కావాలి
ఆయుధం
సంపూర్ణ ఆరోగ్యం
ఆనందంతో
మనోల్లాసంతో
మానవమనుగడ
సాధిద్దాం
సమాజంలో సామరస్య
సహజీవన సమరసత
సౌందర్య వెలుగులు
విరజిమ్మే దివ్వెలమౌదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
గ్రామం ‘కల్లెపల్లి’ మండలం బెజ్జంకి జిల్లా సిద్దిపేట
9440245771