12 న జిల్లా యోగాసన పోటీలు
తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 11
యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 12న శుక్రవారం తానుర్ మండల కేంద్రంలోని డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్ లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కదమ్ మోహన్ రావు పటేల్, జనరల్ సెక్రటరీ ఉప్పు రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో 8 సంవత్సరాల వయసు నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ -పురుష అభ్యర్థులు పాల్గొనవచ్చని సూచించారు. పాల్గొనే అభ్యర్థులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 9640463434ఈ నంబర్ ని సంప్రదించాలని తెలిపారు.