జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాఠశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం

: జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాఠశాల సందర్శన, విద్యార్థులతో భోజనం.
  1. నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు.
  2. తెలంగాణ ప్రభుత్వ డైట్ మెనూ సౌకర్యాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు.
  3. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి అభిరుచులను తెలుసుకున్నారు.
  4. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

: జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాఠశాల సందర్శన, విద్యార్థులతో భోజనం.

నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల పాఠశాలల తనిఖీ సందర్భంగా న్యూ కామన్ డైట్ మెనూ వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పనపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని జీవితంలో విజయం సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించారు.

నిర్మల్:
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న న్యూ కామన్ డైట్ మెనూ వసతులను సమీక్షించేందుకు ఈ రోజు జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులను పరిశీలించారు. చలికాలం కారణంగా వేడి నీటి సౌకర్యం, మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.

డా. జానకి షర్మిల మాట్లాడుతూ, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థినని పేర్కొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి నచ్చిన రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహం అందించాలన్నారు.

తన పర్యటనలో భాగంగా, విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అభిరుచులు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం గత 8 సంవత్సరాలలో 40 శాతం వరకు డైట్ ఛార్జీలను పెంచి విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment