- మహారాష్ట్ర ఎన్నికల దృష్ట్యా సిర్పల్లి చెక్ పోస్ట్ పరిశీలన.
- డబ్బు, మద్యం, ఇతర వస్తువుల నియంత్రణపై కఠిన చర్యలు.
- ఎస్పీ సూచనలతో సిబ్బంది తనిఖీల విధుల్లో సమన్వయం.
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సిర్పల్లి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆకస్మికంగా సందర్శించారు. సీజ్ చేసిన వస్తువుల వివరాలు తెలుసుకొని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం నియంత్రణపై చర్యలు తీసుకోవాలని, తనిఖీల సమయంలో వీడియోగ్రఫీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మహారాష్ట్రలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, నిర్మల్ జిల్లా సరిహద్దులోని సిర్పల్లి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా చెక్ పోస్టుల సిబ్బంది విధులను పరిశీలించి, ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతర వస్తువుల వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేయడానికి చెరవేయబోయే డబ్బు, మద్యం, ఇతర సామాగ్రి నియంత్రణ కోసం చెక్ పోస్టుల ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుండి మన రాష్ట్రానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, తనిఖీల సమయంలో వీడియోగ్రఫీ నిర్వహించాలని సూచించారు.
చెక్ పోస్ట్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు అందించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, చెక్ పోస్ట్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.