టపాకాయల దుకాణాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

టపాకాయల దుకాణాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

టపాకాయల దుకాణాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి

జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

మనోరంజని మహబూబ్నగర్ ప్రతినిధి

దీపావళి పండుగ సందర్భంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి (Permission) పొందాలని జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ సూచించారు.

అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసినట్లయితే Explosives Act – 1884 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి అని సూచించారు.

టపాకాయల దుకాణాదారులు పాటించవలసిన ముఖ్య నిబంధనలు:
టపాకాయల దుకాణాలు జనావాసాలకు దూరంగా, ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.
షాప్ ఏర్పాటు చేసే ప్రదేశానికి సంబంధించి స్థల యజమాని నుండి NOC సర్టిఫికేట్ పొందాలి.
ప్రతి టపాకాయల షాప్ మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి.
షాపులు రెసిడెన్షియల్ ప్రాంతాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి.
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో టపాకాయల షాపులు ఏర్పాటు చేయరాదు.
షాపుల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, బకెట్లు, ఇసుక, నీరు మొదలైన అగ్ని ప్రమాద నివారణ పరికరాలు తప్పనిసరిగా ఉంచాలి.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసు విభాగం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని ఎస్పీ హెచ్చరించారు.
దీపావళి పండుగను ప్రజలు సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment