తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల షెడ్‌ను పరిశీలించిన జిల్లా అధికారులు

తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల షెడ్‌ను పరిశీలించిన జిల్లా అధికారులు

తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల షెడ్‌ను పరిశీలించిన జిల్లా అధికారులు
రైతుకు మార్గదర్శనం చేసిన ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 29 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లోని తాండ్ర గ్రామంలో పట్టు పురుగుల పెంపకం చేస్తున్న రైతు రాజేశ్వర్ వ్యవసాయ పొలాన్ని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి. రమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టు పురుగుల పెంపకం కోసం అవసరమైన వాతావరణ పరిస్థితులు, ఆకు నాణ్యత గురించి వివరంగా తెలియజేశారు. ఆకు నాణ్యత పట్టు గూళ్ల నాణ్యతను నిర్ణయిస్తుందని రమణ అన్నారు. సరిగ్గా నానిన ఆకు అందించగలిగితేనే పురుగులు ఆరోగ్యంగా పెరిగి మంచి నాణ్యత గల గూళ్లు తయారవుతాయన్నారు. పట్టు షెడ్‌ను పరిశీలించిన అనంతరం రైతు రాజేశ్వర్‌ను ప్రశంసిస్తూ మరింత శ్రద్ధతో సాగు చేయాలని సూచించారు.ఈ సందర్శనలో ఉద్యాన శాఖ అధికారి సాదుల మౌనిక కూడా పాల్గొన్నారు. ఈ పరిశీలన రైతులకు ప్రోత్సాహాన్నిస్తూ, పట్టు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment