అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తాం : జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి జూలై 28 : అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని రంగారెడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.
సోమవారం షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కాలే యాదయ్యతో లబ్ధిదారులకు అందచేశారు.అనంతరం వారు షాబాద్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు మరియు ల్యాబ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్ కార్డులు మాత్రమే అందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకనూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.తెల్ల రేషన్ కార్డులకు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నందున రేషన్ కార్డులకు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఉన్నదని వారు అన్నారు.
అయితే అర్హులైన వారికే కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సమానంగా నిరుపేదలు కూడా సన్న బియ్యంతో కూడిన భోజనం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరిస్తూ అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు వెంకటరెడ్డి, కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు మునుపటి నర్సింలు,పైలాన్,జనార్దన్ రెడ్డి,ఖాజా మియా, నరేందర్ రెడ్డి, మహేందర్ గౌడ్, రవీందర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, లింగం, జంగయ్య,సీనియర్ నాయకులు దండు రాహుల్ గుప్త, గౌరీశ్వర,వెంకట్ రెడ్డి, కృష్ణ రెడ్డి, రాహుల్,మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, అన్వర్, ప్రభాకర్ రెడ్డి, కిషోర్, శేఖర్, రఫిక్,మాణిక్యం, శ్రీనివాస్, సంబంధిత అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, పాల్గొన్నారు..