సమాజ జాగృతంలో జర్నలిస్టులు కీలకం : జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 22 : సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో టీయూడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభ వాల్ పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.అనంతరం చేవెళ్ల డివిజన్ జర్నలిస్టులకు ప్రమాద బీమాకు ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడంలో జర్నలిస్టుల ది కీలక పాత్ర అన్నారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు గణేష్,రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.