పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 14
పోలింగ్ కేంద్రాన్ని  పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

పోలింగ్ కేంద్రాన్ని  పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలం ధని గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,ఎస్పీ జానకి షర్మిల సంయుక్తంగా కలసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.ఈ పర్యవేక్షణలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు,తహశీల్దార్ సంధ్యారాణి ఎస్సై శ్రీకాంత్ సంబంధిత పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది పలువురు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment