విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, త్రాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలో వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్య బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న పోషక ఆహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు. పాఠశాల, విద్యాలయంలో కిటికీలు, తలుపులు, మూత్రశాలలు, ఫ్యాన్లు, లైట్లు ఇతర పాడైన వాటిని పరిశీలించి మరమ్మత్తులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న మూత్రశాలల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment