రైతులకు సరిపడా యూరియా ను అందుబాటులో ఉంచాలి.
-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 28 –
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని (పి.ఏ.సి.ఎస్) ప్రైమరీ అగ్రికల్చర్ కొఆపరేటివ్ సొసైటీ యూరియా పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్,రసీదు బుక్ ను పరిశీలించారు.వానాకాలం రైతుల అవసరాల మేరకు యూరియా ను,జీలుగా,విత్తనాలను సరిపడే నిల్వలు ఉండేలా నిర్వహించాలని ఆదేశించారు. యూరియా పంపిణీ విధానాన్ని అక్కడే ఉన్న రైతులకు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు మోసం చేసే చర్యలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంటా జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఏ.ఒ వికార్ అహ్మద్ ఉన్నారు