యూరియాను దారి మళ్లిస్తే చర్యలు తప్పవు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మనోరంజని ప్రతినిధి ఆగస్టు 01 –
నిర్మల్ జిల్లా,సారంగాపూర్ : ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇచ్చే యూరియాను దారి మల్లిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం సారంగాపూర్ మండలకేంద్రం లోని అగ్రీస్ రైతు సేవ కేంద్రం, చించోలి(బి) గ్రామంలో గల డిసిఎంఎస్ రైతు సేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్,రసీదు బుక్ ను పరిశీలించి యూరియా నిల్వ ఉన్న గోధం ను తనిఖీ చేసారు.ఎరువులు విక్రయ సంబంధిత రసీదు రైతులు తప్పక ఇవ్వాలని నిర్వాహకులకు ఆదేశించారు.అక్కడే ఉన్న రైతులతోమాట్లాడారు..యూరియా అన్ని ఎరువులు విత్తనాల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి .మోతాదుకు మించి యూరియా వాడద్దు,పంటకు అవసరం మైన మోతాదులో యూరియా, డి.ఎ.పి లను వాడలని సూచించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి యూరియాని ఎవరైనా దారి మళ్లించే చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎరువులు విత్తన దుకాణాలపై ఎప్పుడు పర్యవేక్షణ నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంటా జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, తహసిల్దార్ శ్రీదేవి,ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఏ.ఒ వికార్ అహ్మద్ ఏఈఓ లక్ష్మీ ఉన్నారు.