సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 05
నిర్మల్ జిల్లా ,సారంగాపూర్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.మండలంలోని చించోలి (బి) పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాకాలం రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అవసరమగు మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
ఓపీ రిజిస్టర్, మందుల నిల్వ గదిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం
ఆసుపత్రికి రోజూ వచ్చే రోగుల వివరాలు, మందుల వినియోగం, నిల్వలు, టీకాలు సంబంధిత వివరాలన్నీ ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలనీ వైద్య అధికారికి మొహిమ్అలీ ని ఆదేశించారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలందించలంనారు.దవాఖానా చిట్టు పరిశుభ్రంగా ఉంచుతూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో .. జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు, వైద్యాధికారి సౌమ్య,హెల్త్ సప్రవేసర్ ప్రేమ్ సింగ్,అసిస్టెంట్ రాజేందర్, ఏ ఎన్ ఎం లు,ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.