- దుర్గామాత వీడ్కోలు నిమ్మజనం సందర్భంగా మహా అన్నదానం
- శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ
- భక్తులను అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఆహ్వానం
నిర్మల్ జిల్లా మహిషా పట్టణంలోని శ్రీ పోచమ్మ ఆలయంలో ఈ నెల 25 న శుక్రవారం ఉదయం 10 గంటలకు మహా అన్నదానం ప్రసాద వితరణ జరుగుతుంది. దుర్గామాత వీడ్కోలు నిమ్మజనం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.
భైంసా, అక్టోబర్ 21:
నిర్మల్ జిల్లా మహిషా పట్టణంలో, దుర్గామాత వీడ్కోలు నిమ్మజనం పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం అనువాయితీగా శ్రీ పోచమ్మ ఆలయంలో మహా అన్నదానం ప్రసాదం వితరణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు గోపాల్ సూత్రావే తెలిపారు.
ఈ నెల 25 న శుక్రవారం ఉదయం 10 గంటలకు దేవస్థానంలో అమ్మవారి హారతి నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదానం ప్రసాద వితరణ నిర్వహించబడుతుంది.
అందువల్ల, హిందు బంధువులు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని ముత్యపు శశి నారాయణ మరియు దేవి స్టూడియో ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.