విద్యార్థులకు ఐడి కార్డులు-బెల్టుల పంపిణీ

విద్యార్థులకు ఐడి కార్డులు-బెల్టుల పంపిణీ

విద్యార్థులకు ఐడి కార్డులు-బెల్టుల పంపిణీ

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 14

ముధోల్ మండల ఆష్ట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- ప్రాథమిక పాఠశాలలోని 220 మంది విద్యార్థులకు ఆష్టా గ్రామ యువకుడు పట్టేపూర్ సతీష్ రెడ్డి దాదాపు 25వేల రూపాయల వ్యయంతో ఐడీ కార్డులు, బెల్టులు, టైలు సమకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా దాత పట్టేపుర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆష్టా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వేషధారణ ప్రైవేట్ పిల్లలకంటే ధీటుగా ఉండాలని అన్నింటా ముందు ఉండాలనే ఆకాంక్షతో ఐడీ కార్డులు,టై ,బెల్టులు ఉన్నత పాఠశాల – ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించామని అన్నారు. ఇదివరకే పాఠశాలకు ప్రహరీ గోడ, టాయిలెట్స్ మంజూరు చేయించామని ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన అన్నారు. ముధోల్ మండల విద్యాధికారి- ఆష్ఠ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపిడి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నిస్వార్థ సేవలు అందిస్తున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యార్థులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారి బాగు కోసం కృషి చేస్తున్న పట్టెపుర్ సతీష్ రెడ్డిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి పాఠశాలను తమదిగా భావించి మరింత చేయూత అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ఐడీ కార్డులు, టై, బెల్టులు పంపిణీ చేశారు. దాత పట్టేపుర్ సతీష్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు బిజ్జురు సాయారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలగం రాంమోహన్, ఆష్టా కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment