రామకృష్ణ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

రామకృష్ణ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

రామకృష్ణ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

నిజామాబాద్ మనోరంజిని ప్రతినిధి ఆగస్టు 26

గణపతి నవరాత్రుల సందర్భంగా నగరంలోని రామకృష్ణ పాఠశాల విద్యార్థులు.. పర్యావరణాన్ని కాపాడుతూ.. పర్యా వర్ణాన్ని కాపాడాలని ప్రత్యేక సందేశాన్ని ఇస్తూ.. శ్రీ వినాయకుని ప్రతిమలు మట్టితో తయారు చేశారు. సుమారు 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంలో రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి చోట గణపతి ప్రతిమలు వివిధ రంగులతో.. మరియు ఆర్టిఫిషియల్ కలర్ లతో.. కెమికల్ ఉపయోగించే గణనాథులను తయారు చేయడం.. వాటిని మనం నీళ్లలో విసర్జించడం.. దాని ద్వారా నీటి కలుషితమే కాకుండా పర్యావరణాన్ని కాపాడలేకపోతున్నామని.. ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీ రామకృష్ణ విద్యాలయ విద్యార్థులకు విటి పై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడే విధంగా నీటిని కలుషితం కాకుండా.. మట్టి మాత్రమే ఉపయోగించి 100 బ్రతిమాలు తయారు చేయడం జరిగిందని.. మా ఈ కార్యక్రమం ద్వారా 100 మంది ఇళ్లలో మట్టి ప్రతిమలు ఉంటాయని.. తద్వారా ప్రజల్లో కూడా అవగాహన వస్తుందని.. మట్టి గణపతులే వాడాలి కలుషితమైన కలర్లు ఉన్న గణపతులు వాడకూడదు అనే సందేశాన్ని మేము ప్రజలకు తెలియపరచడమే మా అభిమతం అని.. తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేషమేమనగా సుమారు 100 మంది విద్యార్థులు.. ఆ గణనాథుని ఆకారంలో.. నృత్యాలు చేయడం విశేషం.. తద్వారా విద్యార్థులలో ఎటు ప్రజలలో భక్తి భావనలు పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సముద్రాల మధు మాధురి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment