మధిర లో ఎడ్లబండ్ల ఇసుక అక్రమ రవాణా తో ప్రజా రవాణాకు అంతరాయం…
ఇసుకను ఎలాగూ దోచుకుంటున్నారు కనీసం సమయపాలనైనా పాటించరా అని ప్రశ్నిస్తున్న ప్రజలు
ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టారాజ్యంగా నిత్యం ఎడ్లబండ్లతో అక్రమంగా ఇసుకతోలకాలు..
చోద్యం చూస్తున్న అధికారులు..
ఇప్పటికే రైల్వే మూడో లైన్ పనులు పనుల వల్ల రైల్వే అండర్ బ్రిడ్జి నుండి రాకపోకల నిలిపివేత
టు వీలర్ నుండి భారీ వాహనాలు మొత్తం రైల్వే ఆర్ఓబి పైనుండే రాకపోకలు కొనసాగిస్తున్న సమయంలో ఎడ్ల బండ్ల ఇసుక అక్రమతోలకంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
ప్రజా రవాణా విషయం పై స్పందించి సమయపాలన పాటించకుండా నిరంతరం ఎడ్లబండ్ల తో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై పోలీసు వారు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు