ప్లెక్సీల్లో ఇంచార్జీ లేక పోవడంపై యువకాంగ్రెస్లో అసంతృప్తి
నిర్మల్ డిసిప్లిన్‌పై నేతల్లో విమర్శలు –
పార్టీ గ్రూపుల్లో , ఫోటోలు వైరల్
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, నవంబర్ ●: 21
నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యకలాపాల్లో క్రమశిక్షణ లోపిస్తుందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమర సింహారెడ్డి నిర్వహించిన ఇటీవలిన సమావేశాల్లో ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాంభూపాల్ ఫోటో చోటు లేకపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ విషయం పై పార్టీ నేతల మధ్య చర్చలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా అదే పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఈ అంశాన్ని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తూ తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోవడాన్ని ఇంచుమించు నేతలు తప్పుబడుతున్నట్లు సమాచారం. యువజన కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.