భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఎస్పీ డి. జానకి
-
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనకు ముందు భద్రతా సమీక్ష
-
పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం, కలెక్టర్ కార్యాలయ కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు
-
వీడియో సర్వైలెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి
మహబూబ్నగర్ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనను దృష్టిలో ఉంచుకుని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్, మరియు జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్, పాలమూరు యూనివర్సిటీ, కలెక్టర్ కార్యాలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ నందు జరగనున్న నాలుగవ స్నాతకోత్సవం మరియు ఐడిఓసి–కలెక్టర్ కార్యాలయంలో జరుగనున్న అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జోగులాంబ జోన్–VII డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్, జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, “గవర్నర్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలి. పోలీస్ అధికారులు బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. వీడియో సర్వైలెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని సూచించారు.
ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, “గవర్నర్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. అన్ని శాఖల సమన్వయంతో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం” అని పేర్కొన్నారు.