M4News ప్రతినిధి
హైదరాబాద్: అక్టోబర్ 19
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు తదితర సమస్యల కారణంగా 2022లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటి వరకు ముందుకు కదలలేదు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు తిరిగి నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేసింది. తాజా ఆందోళనలు జీవో 29పై అభ్యర్థులు రోడ్డెక్కడానికి కారణం.
GO 29 vs GO 55: అసలు వివాదం ఏంటి?
అభ్యర్థుల అభ్యంతరాలు ఎక్కువగా జీవో 29పై ఉన్నాయి. గతంలో అమలైన GO 55 ప్రకారం, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఓపెన్ క్యాటగిరిలోనూ అవకాశం ఉండేది. ఇది రిజర్వుడ్ అభ్యర్థులకు మెయిన్ పరీక్షల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చేది. అయితే, ప్రస్తుతం ఉన్న GO 29 ప్రకారం, రిజర్వడ్ వర్గాలకు ఓపెన్ క్యాటగిరిలో అవకాశం ఉండదని పేర్కొంది, ఇది రిజర్వేషన్ వర్గాలపై అన్యాయం జరుగుతున్నదని అభ్యర్థుల వాదన.
ప్రత్యక్ష నిరసనల కారణం:
అక్టోబర్ 21నుంచి 27 వరకు జరగబోయే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థులు హైకోర్టులో పలు కేసులు వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనున్నది. అభ్యర్థులు డిమాండ్ చేస్తు్న్నది ఏమిటంటే, జాబ్ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయడంలో వివక్ష ఉందని, జీవో 29ని రద్దు చేయాలని.