మహిళ ప్రాణాన్ని కాపాడిన డయల్ 100 – నారిశక్తి బృందం సమయస్ఫూర్తి ప్రశంసనీయం
మనోరంజని తెలుగు టైమ్స్ – ముధోల్ ప్రతినిధి, నవంబర్ 13:
ముధోల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళ కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ముధోల్ నారిశక్తి బృందం సమయస్ఫూర్తితో స్పందించి, చెరువులో దూకిన ఆ మహిళను కాపాడి ప్రాణాపాయం నుండి రక్షించింది.
వెంటనే ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యుల సంరక్షణలో అప్పగించారు. తదుపరి సహాయం కోసం భరోసా సెంటర్కు తరలించారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూ —
“మహిళలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు. నిర్మల్ పోలీస్ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు అండగా ఉంటుంది” అని తెలిపారు.
ఈ ఆపరేషన్ను ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మరియు ఎస్ఐ పెర్సిస్ పర్యవేక్షణలో నారిశక్తి బృందం విజయవంతంగా నిర్వహించింది.
ప్రజలలో అవగాహన పెంపొందించే విధంగా, పోలీసు శాఖ వేగవంతమైన చర్యకు స్థానికులు అభినందనలు తెలిపారు.