దూరం” షార్ట్ ఫిల్మ్: తరుణ్ తేజ్ దర్శకత్వంలో ఒక కొత్త ప్రయాణం

"దూరం" షార్ట్ ఫిల్మ్ - తరుణ్ తేజ్, సుధాకర్ అక్కినేపల్లి
  • యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో “దూరం” షార్ట్ ఫిల్మ్.
  • మణి రూప్ రెడ్డి, సుప్రియ జంటగా నటిస్తున్నారు.
  • ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి భాగస్వామ్యం.
  • “ఫిల్మ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాదు” (FTIH) కు సమర్పణ.

 డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో రూపొందించిన “దూరం” షార్ట్ ఫిల్మ్, ప్రస్తుత జెనరేషన్ కంటెంట్ ఆధారంగా తెరకెక్కింది. మణి రూప్ రెడ్డి, సుప్రియ జంటగా నటించిన ఈ చిత్రం, ప్రముఖ cinematographer సుధాకర్ అక్కినేపల్లి సహకారంతో రూపొందుతోంది. తరుణ్ తేజ్ ఈ షార్ట్ ఫిల్మ్‌ను FTIH ఇన్స్టిట్యూట్‌కు సమర్పించనున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ “దూరం” ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి సహకారంతో రూపొందింది. మణి రూప్ రెడ్డి, సుప్రియ జంటగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్, ప్రస్తుత సమాజంలో ఉన్న కంటెంట్‌ను కథగా తీసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా, డైరెక్టర్ తరుణ్ తేజ్ మాట్లాడుతూ, “ఈ షార్ట్ ఫిల్మ్‌ని మా FTIH ఇన్స్టిట్యూట్‌కు సబ్మిట్ చేయబోతున్నాను. నాకు తోడుగా నిలబడిన టీం అందరికి ధన్యవాదాలు. మా అమ్మ, నాన్న మరియు అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు,” అని తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినేపల్లి మాట్లాడుతూ, “నా కెరీర్ మొదలైనది షార్ట్ ఫిల్మ్స్ నుండి, ఈ రోజు పెద్ద సినిమాలకు పనిచేస్తున్నా, తరుణ్ తేజ్ వంటి డైరెక్టర్లకు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది,” అని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment