బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన తలమడుగు మండలంలోని రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఈ పండుగ కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహారం అని, ఇది మత సామరస్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
హాసేన్ హుసేన్ దేవస్థానంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన తలమడుగు మండలంలోని రుయ్యాడి దేవస్థానాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహారం అని అన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన హాసేన్ హుస్సేన్ దేవస్థానం మన బోథ్ నియోజకవర్గంలోనే ఉండటం గొప్ప విషయమని అన్నారు. వచ్చే ఏడాది మరింత పెద్దఎత్తున ఈ పీర్ల పండుగను జరుపుతామని తెలిపారు.
పీర్ల పండుగ వచ్చిందంటే గ్రామంలో ఐక్యమత్యంతో మొహారం అయ్యేంత వరకు చెప్పులు ధరించకపోవడం, అలాగే ఎక్కడున్నా ప్రతీ ఒక్కరు గ్రామానికి వచ్చి పండుగను జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












