నిర్మల్, 2026-08-25
రేణుకాపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని కమిటీ అధ్యక్షుడు ప్యాట్ల సుఖేష్ రావు తెలిపారు.
అందరితో కలిసిమెలిసి, ఐక్యతతో, ప్రేమతో జీవించడమే నిజమైన భక్తి అని రేణుకాపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ నూతన కమిటీ కార్యవర్గం నిరూపించింది. బాసర దక్షిణముఖి హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు దానరూపేణా, వస్తురూపేణా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
నిర్మాణ పనులు ముమ్మరం
హనుమాన్ ఆలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని కమిటీ అధ్యక్షుడు ప్యాట్ల సుఖేష్ రావు తెలిపారు. గ్రామస్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థానిక హనుమాన్ భక్తుడు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో భక్తుడు తాగునీటి కోసం బోరు బావిని తవ్వించారని, ఈరోజు ఆలయ నిర్మాణానికి స్థానిక భక్తుడు ఇసుక, కాంక్రీటు మిశ్రమాన్ని అందించారని పేర్కొన్నారు.
దాతలకు సన్మానం
ఆలయ కమిటీ తరపున విరాళాలు అందించిన దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. భక్తితో పాటు సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న దాతలను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.












