నిర్మల్ ఆర్టీసీ డిపో భక్తుల సౌకర్యార్థం జూలై 5వ తేదీన రామేశ్వరానికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపనుంది. ఈ బస్సు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించనుంది.
నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భక్తుల అభ్యర్థనల మేరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. ఇదివరకే జూన్ 5న ఒక సర్వీసు విజయవంతంగా నిర్వహించబడింది.
జూలై 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుండి బయలుదేరే ఈ బస్సు, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, మదురై, రామేశ్వరం, కాంచీపురం, బంగారు బల్లి, శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తుంది. బస్సు జూలై 11న తిరిగి నిర్మల్ చేరుకుంటుంది.
ఈ యాత్రకు ఒక్కొక్కరికి 8,000 రూపాయల చార్జీగా నిర్ణయించబడింది. యాత్రికులు నిర్మల్ బస్టాండ్లోని కౌంటర్లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలు, బుకింగ్స్ కోసం 9959226003, 9440018549 నంబర్లను సంప్రదించవచ్చని డిపో అధికారులు తెలిపారు.












