కుంటాల మండల కేంద్రంలో భక్తుడు తుంగ సురేష్ ఆధ్వర్యంలో హనుమాన్ పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుంటాల మాజీ ఎంపిపి జీవీ రమణారావు, భక్తులతో కలిసి భిక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.
భక్తి, సేవాభావంతో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. గురు స్వాములు భుజంగం గణపతి, కృష్ణ, రమేష్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
స్థానికులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.


