లోకేశ్వర మండలం బాగాపూర్ గ్రామ శివారులో ఉన్న రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో మొదటి రోజుగా ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు.
మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా, యాగశాల ప్రవేశం చేసి, మూల విరాట్‌కు పంచోపనిషత్తులతో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగపూజ, అగ్ని ప్రతిష్టాపన, నవగ్రహ పూజలు, వాస్తు పూజ, యోగిని మండప, క్షేత్రపాలక మండపారాధనలు, శాంతి పాఠం, తులసి పూజ వంటి విశేష క్రతువులు వైభవంగా జరిగాయి.
మహా హారతి కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ ఉత్సవాలలో ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బాగాపూర్ సర్పంచ్ శ్రీ వేద ప్రణీత్ రెడ్డి, నాలం సంతోష్, రాజు, పవన్, వామన్, ఆలయ అర్చకులు నరసింహస్వామి మరియు గ్రామ భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.


