ఖానాపూర్, జూలై 20
ఖానాపూర్ పట్టణంలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వరుణ పాశుపతి సాహిత వరుణ హోమ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి ఉపఅధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కూడా పాల్గొన్నారు.
ఖానాపూర్ పట్టణంలోని గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వరుణ పాశుపతి సాహిత వరుణ హోమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ జిల్లా డిసిసి ఉపఅధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణ గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సందీప్ శర్మ మాట్లాడుతూ, వర్షం లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో విత్తనాలు వేసుకోలేకపోతున్నారని, భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కలంగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో ఈ వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సందీప్ శర్మ, కాంగ్రెస్ డిసిసి వైస్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్ రాజుర సత్యం, సభ్యులు రాజు, రాఘవేంద్ర శర్మ, నిమ్మగడ్డ నాగరాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.











