బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 28
బోథ్ గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోథ్ గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బోథ్ గ్రామ సర్పంచ్ కూర్మె అన్నపూర్ణ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.
అమ్మవారికి భక్తితో బోనం సమర్పించడం ద్వారా గ్రామంపై అమ్మవారి చల్లని చూపు ఉంటుందని, గ్రామం సుభిక్షంగా, ఆరోగ్యంగా, సిరిసంపదలతో వర్ధిల్లుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. అందరూ కలిసి పండుగను జరుపుకోవడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూర్మె అన్నపూర్ణ మహేందర్, వార్డు సభ్యులు బిట్లింగ్ ఉమా, సోలాంకి గిరిజ బాయి, కరిపే శ్రీను, భక్తులు అరె చిన్న మాధు, రాజేష్ అరె, కాలనీ ప్రజలు రూప రాజు, రాణి, ఇంద్ర, సోలాంకి సంతోష్, సాయి కుమార్, నారాయణ, పుష్ప, సంజయ్, గిరీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.












