బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 02
బోథ్ మండల కేంద్రంలోని శ్రీ కొట్టాల పోచమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఆషాఢ బోనాల మహోత్సవంలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.
బోథ్ మండల కేంద్రంలోని శ్రీ కొట్టాల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆషాఢ బోనాల మహోత్సవంలో భాగంగా, ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందారు.












