బాసర ఆలయంలో లడ్డు ధరల పెంపుపై భక్తుల్లో ఆగ్రహం

బాసర ఆలయంలో లడ్డు ధరల పెంపుపై భక్తుల్లో ఆగ్రహం

ఉచిత లడ్డు నిలిపివేత, అభిషేక లడ్డు రూ.100 నుంచి రూ.150 — హిందూ సంఘాల ఆవేదన

మనోరంజని తెలుగు టైమ్స్ బాసర, నవంబర్ ●: 21

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసానికి సంబంధించిన ₹150 టికెట్‌పై ఉచిత లడ్డు పంపిణీ నిలిపివేయడం, అలాగే అభిషేకం లడ్డు ధరను ₹100 నుండి ₹150కు పెంచడం పట్ల భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూరాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యంలో పలు హిందూ సంస్థలు కలిసి ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశాయి. భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై సమావేశంలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేందుకు ఎండోమెంట్స్ శాఖ అధికారులు చేస్తోన్న చర్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీరామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నంవార్ శ్రీహరి, అధ్యక్షులు పల్లెర్ల శేఖర్, రాష్ట్రీయ శివాజి సేన సభ్యులు తాడోజి శ్రీనివాస్, చేతన్ గాడి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment