ఆర్మీ అధికారిని కాపాడిన దేవేందర్ రెడ్డికి ప్రశంసాపత్రం
ఆర్మీ తరఫున ఏఎస్పీ చేతుల మీదుగా అందజేత
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – ఆగస్టు 22
ఇటీవల కొండాపూర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి, అతని కుటుంబ సభ్యులను ఏఎస్పీ రాజేష్ మీనా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడిన వైద్యుడు దేవేందర్ రెడ్డి సేవలను గుర్తించి భారత ఆర్మీ ప్రశంసాపత్రాన్ని పంపింది.
జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా ఆ ప్రశంసా పత్రాన్ని దేవేందర్ రెడ్డికి అందజేస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్థానికులు కూడా దేవేందర్ రెడ్డి స్పందనను ప్రశంసించారు.