జామ్ పాఠశాల సందర్శించిన డిఇఓ
సారంగాపూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 15
నిర్మల్ డీఈవో దర్శనం భోజన్న సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ, వంట నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనం అందించాలని ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు