మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కాసిపేటలో డిమాండ్లు

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సమావేశం
  • పురుగుల పట్టిన బియ్యంతో వంట చేసే పరిస్థితి.
  • 4 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్.
  • హామీ చేసిన ₹10,000 వేతనాన్ని అమలు చేయాలంటున్న కార్మికులు.
  • ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే పోరాటాలకు సిద్ధమని హెచ్చరిక.

కాసిపేట మండలం దెవాపూర్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సమావేశం జరిగింది. పురుగుల పట్టిన బియ్యం సరఫరా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, కార్మికుల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హామీ చేసిన ₹10,000 వేతనాన్ని అమలు చేయకపోతే పోరాటానికి సిద్ధమని కార్మికులు హెచ్చరించారు.

కాసిపేట మండలం దెవాపూర్ పూర్‌లో మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం (CITU) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి నేతృత్వం వహించారు. కార్మికులు, పిల్లల ఆరోగ్యం, పెండింగ్ బిల్లులు, వేతనాల సమస్యలపై ఈ సమావేశంలో పలు డిమాండ్లు వినిపించాయి.

మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు వండి పెడుతున్న బియ్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పురుగుల పట్టి, నాణ్యత లేని బియ్యం సరఫరా చేయడం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

అదేవిధంగా, 4 నెలల నుంచి బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడం మూలంగా కార్మికులు అప్పుల పాలవుతున్నారని, మరింత అప్పులు చేయడం ద్వారా వంట నిర్వాహణ కొనసాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వేతనాలను ₹10,000కు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలు చేయలేదని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే వేతనాలు, బిల్లులు చెల్లించి హామీలను అమలు చేయకపోతే, రాబోయే కాలంలో తీవ్ర పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment