వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్

  • వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ధపల్లి జిల్లా మంథని మండలంలో వినతిపత్రం సమర్పణ
  • అక్రిడిటేషన్ లేకుండానే అన్ని పత్రికల జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న డిమాండ్
  • డి జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీవో, తహశీల్దార్ కు విజ్ఞప్తి

 

పెద్ధపల్లి జిల్లా మంథని మండలంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, అన్ని పత్రికలతో పాటు చిన్న పత్రికల జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలని మంత్రపురి ప్రెస్ క్లబ్ సభ్యులు డి జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీవో, తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అధ్యక్షుడు గడిపెల్లి అజయ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు సౌకర్యాలు సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

పెద్ధపల్లి జిల్లా మంథని మండలంలోని వివిధ పత్రికలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారికీ ప్రభుత్వ పథకాలు అందించాలని డి జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రపురి ప్రెస్ క్లబ్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని మంగళవారం ఆర్డీవో, మండల తహశీల్దార్ లకు అందజేశారు.

మంత్రపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడిపెల్లి అజయ్ మాట్లాడుతూ, “చిన్న పత్రికలు లేదా పెద్ద పత్రికలు అనే తారతామ్యం లేకుండా, అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలు అందించాలి” అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం కేటాయించిన పథకాలన్నీ ప్రతి జర్నలిస్టుకు అందాలని ఆయన సూచించారు.

అక్రిడిటేషన్ పేరుతో కేవలం కొందరికే ఇంటి స్థలాలు కేటాయించడం అన్యాయమని, కష్టపడే ప్రతీ జర్నలిస్టుకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు.

Leave a Comment