సజ్జనార్ వార్నింగ్తో.. దెబ్బకు యూట్యూబ్లో, ఇన్ స్టాలో వీడియోలు డిలీట్ !
చిన్నారులతో బూతులు మాట్లాడించి.. వీడియోలు తీసే ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు, మైనర్లనే కనీస ఇంగితం లేకుండా ప్రేమించుకున్నారని.. ప్రేమ పక్షులని అమ్మాయి, అబ్బాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక చేశారు.
మైనర్లతో అసభ్యకర కంటెంట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సజ్జనార్ వార్నింగ్తో బెంబేలెత్తిపోయిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్.. మైనర్ల వీడియోలను దెబ్బకు డిలీట్ చేశాయి. కేసుల భయంతో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రీల్స్ డిలీట్ చేస్తున్నారు