- విద్యార్థిని శైలజ పుడ్ పాయిజన్ వల్ల మృతి: అనుమానాస్పద పరిస్థితులు.
- గత ఏడాది లో 50కి పైగా విద్యార్థుల మరణాలు: అధికారుల నిర్లక్ష్యం ముద్ర.
- సర్ప్లై కాంట్రాక్టర్లపై ఆరోపణలు: పాత సామాగ్రి సరఫరా అనుమానం.
- ఆధికారులపై చర్యల డిమాండ్: క్రిమినల్ కేసులు, హత్య కేసుగా విచారణ జరిపించాలి.
- పరిహారం డిమాండ్: బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఉద్యోగం, భూమి.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని శైలజ పుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందడంపై రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాత సామాగ్రి సరఫరా కారణంగా విద్యార్థుల మరణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శైలజ పుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ, గతంలో కూడా గిరిజన, దళిత విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపించారు.
అవినీతిపరులైన కాంట్రాక్టర్ల ద్వారా పాత సామాగ్రిని సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇందుకు జిసిసి, సప్లై చేసిన సంస్థలతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఉన్నత వర్గాలకు చెందిన అధికారులపై వచ్చిన ఆరోపణలపై చర్యలు లేకపోవడం విద్యార్థుల మరణాలకు కారణమని శ్రీకాంత్ విమర్శించారు.
డిమాండ్లు:
- శైలజ మృతికి కారణమైన హాస్టల్ అధికారి, వార్డెన్, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
- బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఉద్యోగం, 10 ఎకరాల భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలి.
- గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న దుర్వినియోగాలను పరిశీలించి, దోషులను తొలగించాలి.
- దీప్యూటేషన్ విధానాలను రద్దు చేసి అర్హులైన అధికారులను మాత్రమే నియమించాలి.