అడెల్లి మహా పోచమ్మ పునఃప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు
మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించిన శ్రీహరి రావు –
అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 01
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం కావడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు శనివారం ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక సేవకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ,
“ఈ నెల నవంబర్ 3వ తేదీ సోమవారం నుండి నవంబర్ 7వ తేదీ శుక్రవారం వరకు వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్న శ్రీశ్రీశ్రీ అడెల్లి మహా పోచమ్మ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,” అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ,
“అమ్మవారి దయతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి కృపతో ఈ మహోత్సవం ఘన విజయవంతంగా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నాను,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్-సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుల్లోజి నరసయ్య, మాజీ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, దశరథ్, రాజేశ్వర్, అయిర నారాయణరెడ్డి, కురువ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.