ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా: అక్టోబర్ 17, 2024
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన దావ్నే గంగాధర్ కూతురు సమైక్య, NEET పరీక్షలో 22000 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు దక్కించుకున్నారు. కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న సమైక్య ఈ విజయంతో కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించారు. ఆమె తండ్రి గంగాధర్, కుటుంబ సభ్యులు అనిల్, తుకెందర్ మాట్లాడుతూ సమైక్య ఎంబిబిఎస్ లో సీటు సాధించడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంలో ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వడేకర్ లక్ష్మణ్, సభ్యులు డాక్టర్ విజయ్, డాక్టర్ అరవింద్, భీమ్రావు, గంగాధర్ సమైక్యను శాలువాతో సన్మానించి అభినందించారు.