యాకర్ పల్లెలో అంగరంగ వైభవంగా దత్తాత్రేయ వేడుకలు
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని యాకర్ పల్లె గ్రామంలో శ్రీ దత్త సాయి మందిరంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వీడీసీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పురోహితులు వారేవార్, కృష్ణ శర్మ, మృత్యుంజయ శర్మల ఆధ్వర్యంలో దత్తాత్రేయ హోమం, శ్రీ గురు చరిత్ర పారాయణం భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.