ఆడెల్లి సర్పంచ్‌గా దండు సాయన్న విజయం

ఆడెల్లి సర్పంచ్‌గా దండు సాయన్న విజయం

సారంగాపూర్, డిసెంబర్ 14 (మనోరంజని తెలుగు టైమ్స్):

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో దండు సాయన్న సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన పోలింగ్ అనంతరం జరిగిన లెక్కింపులో ఆయన ప్రత్యర్థులపై మెజారిటీ సాధించి గెలుపొందారు. దండు సాయన్న విజయం సాధించిన వెంటనే గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు, మద్దతుదారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని దండు సాయన్న ఈ సందర్భంగా తెలిపారు. ఆడెల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామ ప్రజల సహకారం తీసుకుంటూ పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment