మంత్రి పొన్నం వ్యాఖ్యలపై మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ఆగ్రహం

*మంత్రి పొన్నం వ్యాఖ్యలపై మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ఆగ్రహం

మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 07

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అవమానంపై మంతెన స్వామి ఫైర్ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాదిగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సహచర మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాల గౌరవాన్ని అవమానించడమేనని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో “మనకు టైమ్ అంటే తెలుసు… జీవితమంటే తెలుసు… వారికేం తెలుసు ఆ దున్నపోతు గానికి” అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా
చర్చనీయాంశంగా మారాయి.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “మా జాతి బిడ్డ, మాదిగ సమాజానికి గౌరవప్రదంగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య, పొన్నం ప్రభాకర్ స్వయంగా మాదిగ వర్గానికి చెందినవారైనా, సహచర మంత్రిని పక్కన కూర్చోవడానికే ఇబ్బంది పడటం బాధాకరం, దురదృష్టకరం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంతెన స్వామి హెచ్చరిస్తూ “పొన్నం ప్రభాకర్ గెలుపులో మాదిగ వర్గం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే వర్గాన్ని అవమానించడం అంగీకారయోగ్యం కాదు.వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి.లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతాం అని తెలిపారు. మాదిగ హక్కుల దండోరా కార్యకర్తలు పొన్నం ప్రభాకర్ తీవ్ర నినాదాలు చేశారు. “మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అవమానించడం కాదు. మొత్తం మాదిగ జాతినే అవమానించడం జరిగింది. మాదిగలకు డబ్బులు, పదవులు ముఖ్యం కాదు. ఆత్మగౌరవమే ప్రాణం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన సహచర మంత్రిని ఇలా దూషించడాన్ని పక్కనే ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ చూస్తూ ఉండడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.మంత్రి వివేక్ అదేవిధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment