భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
తహసిల్దార్ ఆడే కమల్ సింగ్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న రైతులు నాయకులు
ఆగస్టు 30 కుంటాల ఇటీవల భారీ వర్షం కురవడంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజు కుంటాల తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ కు బిజెపి నాయకులు మరియు రైతులు బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రమైన కుంటాల లోని జననివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజల యొక్క ఆహార ధాన్యాలు తడిసిపోయాయని దీంతో ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం ఇళ్లల్లోకి నష్టమైన ఆహార ధాన్యాలను బాధితులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కుంటాల మండల వ్యాప్తంగా భారీగా పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అధిక వర్షాల మూలంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని వెంటనే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం త్వరగా అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణి గజేందర్ తాటి శివ జక్కుల గజేందర్ మాధవరావు శివలింగం సంతోష్ నారాయణ భూషణ్ సాగర్ రైతులు తదితరులు పాల్గొన్నారు*